NTV Telugu Site icon

IAS Officers Transferred: ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు..

Ias

Ias

IAS Officers Transferred: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సుమిత్‌ కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న పి. ప్రశాంతిని అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.. మరోవైపు పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఎం. విజయ సునీతను అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు.. ఇక, సివిల్‌సఫ్లయ్‌ కార్పొరేషన్‌ వైస్ చైర్మన్‌, ఎండీగా ఉన్న జి. వీరపాండ్యన్‌కు డైరెక్టర్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు.. మరోవైపు ఐఎఫ్‌ఎస్‌ అధికారి రాహుల్ ప పాండ్యేకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది ఉత్తర్వులను పరిశీలించండి..

Show comments