Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలోని ఆల్బెర్టా మిలిటరీ స్థావరంలో లైవ్-ఫైర్ పోరాట శిక్షణలో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురు కెనడియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గాయాలు కాగా.. గాయపడిన వారిలో 19 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఎడ్మంటన్ కేంద్రంగా పనిచేస్తున్న 3వ బెటాలియన్, ప్రిన్సెస్ ప్యాట్రిసియాస్ కెనడియన్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన చార్లీ కంపెనీ సభ్యులు గ్రెనేడ్ రేంజ్, శత్రు స్థావరాలపై దాడుల ప్రాక్టీస్ చేస్తుండగా శనివారం ఈ ప్రమాదం జరిగింది.
మిలిటరీ స్థావరానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మంటలను మిలిటరీ అధికారులు గమనించినప్పటికీ.. శిక్షణను కొనసాగించవచ్చని భావించారు. అయితే.. గాలి దిశ అకస్మాత్తుగా మారడంతో కేవలం 36 సెకన్లలోనే మంటలు సైనికులను చుట్టుముట్టాయి. గాలుల ధాటికి క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయని, సైనికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని మేజర్ జనరల్ వేడ్ రట్‌ల్యాండ్ తెలిపారు.
Also Read
- Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
- EPF and VPF: EPFలో అదనంగా డబ్బు జమ చేయాలా..? VPF వడ్డీ, పన్నులు, విత్‌డ్రాయల్ రూల్స్ ఇవే.!
- Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
- Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
ఈ ప్రమాదంలో మరణించిన వారిని సార్జెంట్ మోర్గాన్ వాంగ్, ప్రైవేట్ షాన్ ఫారెల్, ప్రైవేట్ ఐడాన్ గౌల్డింగ్, ప్రైవేట్ హేడెన్ లైక్మార్క్లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆంబులెన్సులు, విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఆల్బెర్టాలోని ప్రధాన ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలైన కొందరు నెలల తరబడి వైద్య చికిత్స పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
శాంతియుత సమయంలో కెనడా సైన్యంలో జరిగిన అత్యంత దారుణమైన విషాదాలలో ఇది ఒకటని ప్రధాని మార్క్ కార్నీ విచారం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సమాఖ్య భవనాలపై జాతీయ పతాకాన్ని సగం ఎత్తుకు దించాలని ఆదేశించారు. మంటలు చెలరేగడానికి కారణమేమిటనే దానిపై మిలిటరీ , రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ దర్యాప్తు ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
-
Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
-
Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే ‘కల్ట్’ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
-
Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
ట్రెండింగ్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!