Site icon NTV Telugu

Strange Incident : ఒకే కాన్పులో నలుగురు.. ఎక్కడో కాదు మన దగ్గరే

Rajanna

Rajanna

Strange Incident : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు జన్మించడం సర్వసాధారణం. ఎప్పుడో ఓసారి అరుదుగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు కూడా జన్మిస్తారు. కానీ.. ముస్తాబాద్‌లో మాత్రం ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టుముక్కల లావణ్య కాన్పు కోసం ముస్తాబాద్ పీపుల్స్ ఆస్పత్రిలో చేరింది. ఇది ఆమెకు రెండో కాన్పు. అయితే.. మొదటి కాన్పులో ఆమెకు ఓ బాబు.. కాగా.. అతనికి 9 ఏళ్లు. ప్రస్తుతం పుట్టిన వారిలో ముగ్గురు అబ్బాయిలు కాగా, ఒకరు అమ్మాయి ఉన్నారు.

Read Also: Chandrababu Naidu: ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ

ఈ ఘటనలో తల్లితో పాటు పుట్టిన నలుగురు పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. శిశువులు 1 కిలోగ్రాము చొప్పున బరువు ఉన్నారని వెల్లడించారు. వీరిని ఇంక్యుబేటర్‌లో పరిశీలన నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని.. వైద్యులు చెబుతున్నారు. అయితే.. లావణ్యకు మొదటి కాన్పు అయిన తొమ్మిది ఏళ్ల తర్వాత రెండో కాన్పులో ఇలా నలుగురు జన్మించటం.. కుటుంబసభ్యులను ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. తల్లీ పిల్లలు అందరూ క్షేమంగా ఉండటంతో.. కుటుంబసభ్యులకు టెన్షన్ తప్పింది.

Read Also: Parineeti Chopra: ఆప్ నేతతో పరిణీతి సీక్రెట్ గా అది కానిచ్చేసిందా.. ఆ ట్వీట్ కు అర్ధం ఏంటి..?

Exit mobile version