Site icon NTV Telugu

Mahindra University: మహేంద్ర యూనివర్సిటీ డ్రగ్స్‌ కేసులో నలుగురు అరెస్టు..

Arrest

Arrest

బాచుపల్లిలోని మహేంద్ర యూనివర్సిటీ డ్రగ్స్‌ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటికి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ తో పాటు మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. డగ్స్‌ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను గుర్తించింది ఈగల్ టీమ్. కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్‌ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న విద్యార్థులు.. మణిపూర్‌కు చెందిన విద్యార్థి నోవెల్ల కీలక సూత్రధారిగా గుర్తింపు.. నోవెల్ల తో పాటు మరో విద్యార్థి అశర్ జావెద్ ఖాన్ లను అరెస్టు చేసిన ఈగల్..

Also Read:Bapatla: వినాయక చవితి రోజు విషాదం.. తామర పూల కోసం వెళ్లి ఇద్దరు బాలురు మృతి

ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా గంజాయి తెప్పించుకుంటున్న నోవెల్ల.. ఒక్కో గంజాయి సిగరెట్‌ను రూ.2500కు అమ్ముతున్న నోవెల్ల జావెద్‌లు కీలక సూత్రధారులు.. గంజాయి, ఓజీ కుష్‌ కలిపి సిగరెట్లు తయారు చేసి యూనివర్సిటీలో అమ్ముతున్న స్టూడెంట్స్.. ఢిల్లీకి చెందిన అరవింద్‌ శర్మ, అనిల్‌తో కలిసి గంజాయి బిజినెస్.. నైజీరియాకు చెందిన నిక్ నుంచి డ్రగ్స్ ను కొరియర్ లో తెప్పించుకుంటున్నాడు నోవెల్ల. యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలంతో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version