KTR Quash Petition: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు విచారించింది. హైకోర్టు ఆదేశాలపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ అరెస్టుపై జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయరాదన్న ఆదేశాలను ఈ నెల 31 వరకు పొడిగించింది. అనంతరం విచారణను కోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని వారం రోజుల క్రితం హైకోర్టు ఏసీబీని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Read also: VC Sajjanar: ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖాతాలు ఖాళీ.. న్యూ ఇయర్ విషెష్‌పై సజ్జనార్ ట్వీట్..
ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. విధానం ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని సూచించింది. ఇప్పటికే దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఏ1 కేటీఆర్, ఏ2 అరవింద్ కుమార్, ఏ3 బీఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ ఇంకా నోటీసులు జారీ చేయలేదని సమాచారం. అయితే వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అధికారులు సిద్ధం చేశారు.
MLC Kavitha: రిజర్వేషన్లు తేల్చకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..