Strongest Man: వామ్మో!.. ఏకంగా 548కిలోలు ఎత్తేశాడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Strongest Man: మనం మామూలుగా ఎంత బరువెత్తగలం.. మా అంటే 50.. బలవంతుడైతే పది కిలోలు అటుఇటు వంద కిలోల వరకు ఎత్తగలుగుతారు. అదే వెయిట్ లిఫ్టర్లు అయితే 150వరకు ఇదే హయ్యస్ట్… మరి ఏకంగా 500 కిలోలకుపైగా బరువును ఎత్తితే.. వామ్మో అనిపిస్తుంది కదా. ఉక్రెయిన్ కు చెందిన ఒలెక్సి నొవికోవ్ అనే వ్యక్తి 500 కిలోలు ఏం ఖర్మ.. ఏకంగా 548 కిలోల బరువును పైకి లేపి.. ప్రపంచంలోనే అత్యధిక బరువు ఎత్తిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
రెండేళ్ల క్రితం అంటే 2020వ సంవత్సరంలోనే ప్రపంచంలోనే అత్యంత దృఢకాయుడిగా రికార్డు సృష్టించారు ఒలెక్సి. ఈ ఏడాది కూడా ఆ పోటీలో పాల్గొన్నప్పటికీ ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే యూరప్ ఖండం పరిధిలో మాత్రం అత్యంత దృఢకాయుడు ఒలెక్సియే కావడం గమనార్హం. ఇటీవలే అత్యంత బరువు ఎత్తే ఫీట్ ను చేసి చూపారు. అత్యంత భారీ ట్రక్కులకు వాడే 8 టైర్లను రాడ్ కు చెరోవైపు 4 చొప్పున తగిలించుకుని ఆ బరువును పైకి ఎత్తారు. వాటన్నింటి మొత్తం బరువు 548 కిలోలు.
Also Read
- Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
Read Also: Thief Jumps into Sea : పర్స్ కొట్టేసి.. తప్పించుకునేందుకు సముద్రంలోకి దూకాడు
ఈ ఫీట్ కు సంబంధించిన వీడియో రెడ్డిట్ వెబ్ సైట్లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఆయన ఉక్రెయిన్ వ్యక్తి కావడం, అత్యంత బరువును ఎత్తడంతో.. ‘ఇందుకు కదా ఉక్రెయిన్ పై రష్యా గెలవలేకపోతోంది..’’ అని నెటిజన్లు అంటుండటం గమనార్హం. సాధారణంగా బరువులు ఎత్తడానికి ఇనుప ప్లేట్లు వాడుతుంటారు. మరి ఇక్కడ టైర్లు ఎందుకు ఎత్తారు? అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. దీనికి ఒక నిపుణుడు వివరణ ఇచ్చారు. ‘‘జిమ్ లలో బరువులు ఎత్తడాన్ని పవర్ లిఫ్టింగ్ అంటారు. వాళ్లు వయసుల వారీగా, వారీ శరీర బరువుల వారీగా వేర్వేరు కేటగిరీల్లో బరువులు ఎత్తే పోటీలు ఉంటాయి. అదే ధృఢకాయులు (స్ట్రాంగ్ మ్యాన్లు) ఉక్కు ప్లేట్లకు బదులు.. వివిధ రకాల సామగ్రిని ఎత్తుతుంటారు. ఈ క్రమంలోనే భారీ ట్రక్కు టైర్లను ఎత్తడం ఓ సంప్రదాయం..’’ అని తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!