Former MLA Sudheer Reddy Arrested: జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్‌లో నమోదు అయిన ఓ కేసులో అరెస్టు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఉంచిన సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, నా నా దుర్భాషలాడిన కేసులో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.. అయితే.. సుధీర్‌రెడ్డితో పాటు మరో 30 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
READ MORE: India Stops Buying Russian Oil: రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే.. ఇండియా పరిస్థితి ఏంటి..?
ఈ అంశంపై జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు స్పందించారు. వైఎస్ అవినాష్ రెడ్డిని పులివెందులలో అరెస్టు చేసి తరలిస్తున్న సమయంలో కొందరు అడ్డుకొని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పారు.. ఎర్రగుంట్ల సర్కిల్లోని పోలీసుల వాహనాలను అడ్డగించి, అవినాష్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆయన ఇంటికి తీసుకెళ్లారన్నారు… మళ్లీ నాలుగు రోడ్ల సెంటర్లో ధర్నా చేపట్టారని తెలిపారు.. పోలీసుల కస్టడి నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి తప్పించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే సుధేర్ రెడ్డి ప్రయత్నించారన్నారు.. పోలీసుల కస్టడీలో ఉన్న అవినాష్ రెడ్డిని బలవంతంగా మాజీ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, కస్టడీలో ఉన్న వ్యక్తిని దౌర్జన్యంగా తీసుకెళ్లారన్న అంశంపై కేసు నమోదు చేశామన్నారు.. విచారణ కోసం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని.. ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉందని తెలిపారు.
READ MORE: Balakrishna: “అలాంటి వాళ్ల తలలు తీసేయాలి”.. బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు..
