Site icon NTV Telugu

Kethireddy Pedda Reddy: టెన్షన్.. టెన్షన్.. రేపు ఏమవతుందో? తాడిపత్రికి రానున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి..!

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం వివాదాస్పద పరిణామాల నడుమ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో పెద్దారెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సారి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, సోమవారం ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే ఆయనను తాడిపత్రికి తీసుకెళ్లాలని తెలిపింది.

Infinix HOT 60i 5G: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఫోన్ కేవలం రూ.9,299.. కొత్త ఇన్‌ఫినిక్స్ HOT 60i 5G లాంచ్!

ఇక కోర్టు ఆదేశాల ప్రకారం, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఎవరు ఇబ్బందులు కలిగించినా, పోలీసులు అవసరమైతే ఫోర్స్ ఉపయోగించాలి అని సూచించింది. దీంతో రేపు తాడిపత్రిలో ఆయన రాకపై ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు, రేపు తాడిపత్రిలో శివుడు విగ్రహం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దీని వలన అక్కడి రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది.

Nara Lokesh: ఢిల్లీకి పయనంకానున్న మంత్రి లోకేష్.. అందుకేనా?

పెద్దారెడ్డి హాజరు, జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం.. ఈ రెండు పరిణామాలు ఒకేసారి జరుగుతుండటంతో, తాడిపత్రిలో రేపు ఏమి జరుగుతుందోనన్న ఆసక్తి, ఉత్కంఠ అక్కడి ప్రజల్లో నెలకొంది. దీనితో పోలీసులు ఇప్పటికే కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు.

Exit mobile version