Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: ముగిసిన మాజీ మంత్రి పోలీస్ కస్టడీ.. జైలుకు తరలింపు..!?

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: అక్రమ మైనింగ్ కేసులో మరింత విచారణకు సంబంధించి మూడు రోజులపాటు మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిమీ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డికి ఇచ్చిన మూడు రోజుల పోలీసు కస్టడీ నేటితో ముగిసింది. ఈ కస్టడీ కాలవ్యవధిలో రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో రెవిన్యూ, మైనింగ్ శాఖ అధికారుల సమక్షంలో ఆయనను విచారించారు. కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం కాకాణిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు.

Read Also: Michael Clarke: ఐపీఎల్ ఆడడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై విశ్వాసం.. ధోనీపై కీలక వ్యాఖ్యలు..!

ఆ తర్వాత, ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులు పూర్తి వివరాలను సేకరించి విచారణ పూర్తిచేసినట్లు సమాచారం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలో రుస్తుం మైన్స్‌ లో గత ప్రభుత్వ హయాంలో క్వార్ట్జ్‌ అక్రమ రవాణా జరిగిందన్న ఆరోపణలు నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఏ-4గా చేర్చారు.

Read Also: Hari Hara Veera Mallu: హరిహర’ బయటపడాలంటే 120 కోట్లు!

Exit mobile version