NTV Telugu Site icon

Hemant Soren: హేమంత్‌కు మరోసారి ఈడీ కస్టడీ పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!

Hemant

Hemant

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు (Former Jharkhand CM Hemant Soren) మరోసారి ఈడీ (ED) కస్టడీ కోర్టు పొడిగించింది. ఇప్పటికే రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇచ్చింది. దాదాపు 10 రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కస్టడీలో హేమంత్‌ను విచారిస్తున్నారు. మరోసారి ఈడీ కస్టడీని కోరగా… కోర్టు మూడు రోజుల పాటు అనుమతించింది.

మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అటు తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తకుండా తన వారసుడిగా చంపయ్ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నిలబెట్టారు. అనంతరం జరిగిన బలపరీక్షలో కూడా చంపయ్ విజయం సాధించారు.

ఇదిలా ఉంటే ఈడీకి వ్యతిరేకంగా హేమంత్ సోరెన్ వేసిన పిటిషన్ విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. ఆరోజు హేమంత్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది.

తాను ఏ తప్పు చేయలేదని.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల హేమంత్ సోరెన్… బీజేపీకి సవాల్ విసిరారు. ఈడీ తనను అన్యాయంగా అరెస్ట్ చేసిందని హేమంత్ ఆరోపించారు.