Site icon NTV Telugu

R Sridhar: శ్రీలంక కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్..

R Sridhar

R Sridhar

R Sridhar: 2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా టీ20 సిరీస్ ఆడుతుండగా, ఇతర జట్లు వివిధ మార్గాల్లో తమను తాము బలోపేతం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ మెగా టోర్నమెంట్ సహ-ఆతిథ్య భాగస్వామి శ్రీలంక కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇంతకీ శ్రీలంక క్రికెట్ టీం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయానికి టీమిండియా మాజీ ప్లేయర్‌తో ఎలాంటి సంబంధం ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వం ఉండి ఏం లాభం.. ఇది పీపీపీ కాదు, పెద్ద స్కామ్!

శ్రీలంక క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ గెలవడానికి దాదాపు 12 సంవత్సరాలుగా ఎదురుచూస్తుంది. ఈక్రమంలో రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో కచ్చితంగా విజయం సాధించి కప్‌ను ముద్దాడాలని పక్కాగా ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ R. శ్రీధర్‌ను T20 ప్రపంచ కప్ వరకు శ్రీలంక క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. నిజానికి శ్రీధర్ ఒక అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. అయితే ఇటీవల ఆయన శ్రీలంక నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో 10 రోజుల పాటు ఫీల్డింగ్ క్యాంప్‌ను నిర్వహించారు. దీంతో ఆయనకు శ్రీలంక ఆటగాళ్లతో కలిసి పనిచేసిన అనుభవం లభించింది.

శ్రీధర్ శ్రీలంక జట్టుతో కలిసి T20 ప్రపంచ కప్‌కు ముందు రెండు ముఖ్యమైన విదేశీ పర్యటనలలో పని చేయనున్నాడు. మొదట ఆయన పాకిస్థాన్‌లో జరిగే T20 సిరీస్ కోసం శ్రీలంక కోచింగ్ సిబ్బందిలో భాగంగా ఉంటాడు. ఆ తర్వాత ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును సిద్ధం చేయనున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేయడంలో భాగంగా ఉండనున్నాడు. హైదరాబాద్ స్పిన్నర్ అయిన శ్రీధర్ (55) భారత క్రికెట్ జట్టు కోచింగ్ సిబ్బందిలో చాలా కాలం సభ్యుడిగా ఉన్నాడు. 2014 లో ఆయన మొదట టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఆ తరువాత ఆయన రవిశాస్త్రి సిబ్బందిలో భాగంగా ఉండి, 2021 వరకు ఫీల్డింగ్ కోచ్‌గా టీమిండియా తరుఫున పని చేశాడు.

READ ALSO: Vijay Deverakonda: రౌడీ స్టార్‌తో రోమాన్స్‌కు రడీ అవుతున్న బ్యూటీ.. ఎవరో తెలుసా!

Exit mobile version