NTV Telugu Site icon

Kejriwal: అమ్మ పిలిచిందంటూ.. మాతా వైష్ణో దేవిని దర్శించుకోనున్న కేజ్రీవాల్ దంపతులు

Kejriwal

Kejriwal

Kejriwal: అతి త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్ధమవుతోంది. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన భార్యతో కలిసి మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు వెళ్లనున్నారు. తన ప్రయాణం గురించి సమాచారాన్ని అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా ద్వారా అందించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా మాతా వైష్ణోదేవిని దర్శించుకోనున్నారు. ఢిల్లీలో లిక్కర్ పాలసీ స్కామ్ ఆరోపణలపై జైలు నుంచి విడుదలైన తర్వాత, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తన భార్యతో కలిసి మాతా వైష్ణో దేవిని దర్శించుకోవడానికి కత్రా వెళ్తున్నారు.

Read Also: Bengaluru: ఇంత దారుణమా.. తండ్రి అప్పు కట్టలేదని కూతురిపై అత్యాచారం

ఈ విషయం స్సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్‌లో.. “పిలుపు వచ్చింది, అమ్మ పిలిచింది. మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అంటూ తెలిపాడు. అలాగే నేను నా భార్యతో కలిసి మాత వైష్ణో దేవిని సందర్శించడానికి మా అమ్మ ఆశీర్వాదం కోసం వెళుతున్నాను” అని రాసుకొచ్చారు. ఇకపోతే, హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేక పోయినా జమ్మూలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పార్టీలో ఆనంద వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవడం సవాల్‌గా మారింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ సత్యేంద్ర జైన్ తదితర పార్టీల నేతలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చిలో ED అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 6 నెలల పాటు జైలులో ఉన్న ఆయన సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చారు.

Read Also: Naga Chaitanya Shobita Weeding: మొదలైన నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు..

జైలు నుండి బయటకు వచ్చిన తరువాత, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సిఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో ఆప్‌ని మళ్లీ గెలిపించి ప్రజలకు “నిజాయితీ సర్టిఫికేట్” ఇచ్చే వరకు తాను పదవిని చేపట్టనని తెలిపారు.