NTV Telugu Site icon

Andhra Pradesh: వరద సాయం పర్యవేక్షణకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టం అంచనాల విధి విధానాల రూపకల్పన, వరద సాయం పర్యవేక్షణకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నలుగురు మంత్రులతో కేబినెట్‌ సబ్ కమిటీని నియమించింది. మంత్రులు పయ్యావుల కేశవ్‌, నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్‌లతో కేబినెట్ సబ్ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ కన్వీనరుగా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ను నియమించారు. వరద నష్టం అంచనాలపై విధి విధానాలు రూపొందించి త్వరితగతిన ప్రభుత్వానికి సిఫార్సులు అందచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read Also: Minister Payyavula Keshav: జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఏపీ తరపున కీలక ప్రతిపాదనలు

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన శానిటేషన్ పనుల పర్యవేక్షణకి ఐఏఎస్ కన్నబాబు నియామకమయ్యారు. ఐఏఎస్ హరినారాయణన్ స్థానంలో కన్నబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Show comments