Site icon NTV Telugu

Telangana Elections: సింగిల్ ఓటు కోసం సింగపూర్ నుంచి వచ్చారు

New Project (5)

New Project (5)

Telangana Elections: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఓటేసేందుకు జనాలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. వేర్వేరు ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్లిన ఓటర్లంతా ఓటేసేందుకు సొంత గ్రామాలకు చేరుకున్నారు. అలాగే ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఓ కుటుంబం పరాయి దేశం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి చేరుకున్నారు. మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, అనితారెడ్డి దంపతులు గత 15 ఏళ్లుగా సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం జరిగిన ఎన్నికల ప్రక్రియకు సింగపూర్ నుంచి బయలుదేరి స్వగ్రామం రుక్మాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు సింగపూర్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చి రుక్మాపూర్ గ్రామంలో జరిగిన పోలింగ్‎లో ఓటు హక్కు వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Exit mobile version