Site icon NTV Telugu

CM KCR : ‘కర్నాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణానికి రూ. 5కోట్లు మంజూరు చేసిన కేసీఆర్

Cm Kcr

Cm Kcr

CM KCR :‘కర్నాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రూ. 5కోట్లు మంజూరు చేశారు. హైద్రాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా కొనసాగుతున్న హైద్రాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి కొనసాగుతూనే వుంటుందని సీఎం స్పష్టం చేశారు.

Read Also: Revanth Reddy: రేవంత్ రెడ్డి భద్రత పై సస్పెన్స్.. పిటీషన్ పై విచారణ వాయిదా

కన్నడిగుల కోసం హైద్రాబాద్ లో గల సాహిత్య వేదికను పునరుద్దరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైద్రాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్నాటక వాసులు, అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్జప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమ్యునిటీ అవసరాలకు వినియోగించుకునే విధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా తమ విజ్జప్తి మేరకు రూ. 5 కోట్లను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.

Read Also:Minister Jagadish Reddy: గవర్నర్ పై మంత్రి జగదీశ్ ఫైర్

Exit mobile version