NTV Telugu Site icon

Uttarpradesh Bypolls: యూపీ ఉపఎన్నికల్లో ఎస్పీ కూటమిదే హవా.. డింపుల్ యాదవ్‌ నయా రికార్డ్‌..

Dimple Yadav

Dimple Yadav

Uttarpradesh: లోక్‌దళ్ రాష్ట్రంలోని మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ భార్య, లోక్‌సభ మాజీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌ లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుత ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం ఇక్కడ ఎన్నికలు జరిగాయి. డింపుల్, అఖిలేష్ యాదవ్‌లు ‘నేతాజీ’ అని పిలవబడే ములాయం సింగ్‌ యాదవ్ సేవలను గుర్తు చేస్తూ.. ఓట్లు వేయాలని ఎన్నికల కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

యూపీ ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​ భార్య.. మామను మించిన మెజారిటీతో దూసుకెళ్తోంది. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ విజయం దాదాపు విజయం ఖరారైందని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. డింపుల్​ తన సమీప భాజపా అభ్యర్థి.. రఘురాజ్​ సింగ్​ షాక్యాపై భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 ఎన్నికల్లో ములాయంకు 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై గెలుపొందారు. ఇప్పుడు డింపుల్‌కు​ అంతకన్నా మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే లక్ష ఓట్లకు మించి మెజారిటీ రావడం గమనార్హం. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పిలిచే మైన్‌పురిలో డింపుల్‌ విజయం ఖాయమేనని పార్టీ శ్రేణులు మొదట నుంచి విశ్వాసంగా ఉన్నాయి. డిసెంబర్​ 5న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగగా.. 56 శాతానికి పైగా ఓటింగ్​ నమోదైంది.

ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే, సమాజ్‌వాదీ పార్టీలో కీలకమైన వ్యక్తి ఆజం ఖాన్‌పై అనర్హత వేటు పడిన రాంపూర్ అసెంబ్లీ స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. బీజేపీకి చెందిన ఆకాష్ సక్సేనాపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అసిమ్ రాజా పోటీ చేస్తున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా, ఆజం ఖాన్‌పై అనేక క్రిమినల్ కేసులు.. ఎక్కువగా భూ కబ్జా, ఫోర్జరీకి సంబంధించినవి నమోదు కావడంతో ఆయనపై అనర్హతం వేటు పడింది.రాంపూర్ ఉప ఎన్నికలో 40 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. సమాజ్ వాదీ పార్టీ తన మద్దతుదారులను పోలీసులు ఓటు వేయడానికి అనుమతించలేదని ఆరోపించింది. ఈ ఆరోపణను ప్రభుత్వం తిరస్కరించింది.

Gujarat Election Results 2022: గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌.. 

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఖతౌలీ స్థానంలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి మదన్‌ భయ్యా ముందంజలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సావిత్రి మండి ఆధిక్యంలో ఉన్నారు. బీహార్‌లోని కుర్హానీ అసెంబ్లీ స్థానంలో జనతాదళ్‌ (యునైటెడ్‌) అభ్యర్థి మనోజ్‌సింగ్‌ కుష్వాహా ఆధిక్యంలో ఉండగా, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌కుమార్‌ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఒడిశాలోని పదంపూర్‌లో బిజు జనతా దళ్‌ అభ్యర్థి బర్శా సింగ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Show comments