NTV Telugu Site icon

Theft: ముఖానికి మాస్క్.. అంత జాగ్రత్తగా వచ్చి నువ్వు చేసిన దొంగతనం ఇదా?

Donga

Donga

Footwear Theft in Bangalore: ఈ మధ్య  దొంగతనాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. కొన్ని వీటిని ఎందుకు దొంగతనం చేశారు అనేలా ఉంటాయి. ఇక అలాంటి దొంగతనమే ఒకటి తాజాగా బెంగుళూరులో జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Viral Video : ఓరి నాయనో.. కుక్క మనుషులతో వాలీ బాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా?

ఈ వీడియోలో బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్ లోకి మాస్క్ పెట్టకొని ఓ యువకుడు వస్తాడు. అప్పుడు సమయం తెల్లవారు జాము 3:45 గంటలు అవుతుంది. తరవాత ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి పెద్ద పెద్ద సంచులు తీస్తాడు. రెండింటిని మెడలో వేసుకుంటాడు. ఒక రౌండ్ అటు నుంచి ఇటు వచ్చే సరికి అపార్ట్ మెంట్ లో ఉన్న చెప్పులన్ని ఆ సంచుల్లో నింపేస్తాడు. రెండు భారీ సంచుల నిండా చెప్పుులు నింపుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ అపార్ట్ మెంట్ లో ఇలా దొంగతనం జరగడం ఇది మూడోసారి. ఇలా తరచూ చెప్పులు పోవడంతో సీసీ టీవీలో దీని గురించి చూసిన వారు ఓ వ్యక్తి ఇలా చెప్పులు తీసుకువెళ్లడంతో ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ చెప్పులు తీసుకువెళ్లి ఏం చేసుకుంటారా అని ఆలోచిస్తున్నారు. సాధారణంగా గుళ్లలో  చెప్పులు పోవడం చూశాం కానీ ఇలా ఇళ్లలోకి వచ్చి మరీ కొట్టేస్తారా అంటూ నోరెళ్లబెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాస్ట్లీ చెప్పులను లోపల దాచుకోవాలని సూచిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ దొంగలు ఏమైనా చెప్పుల షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారేమో అందుకే ఒకేసారి ఇన్ని చెప్పులు కొట్టేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. చెప్పుల దొంగతనానికి కూడా ఎంత పకడ్బందీగా వచ్చాడో అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

Show comments