Football In Air: ప్రపంచంలో అత్యధికంగా ఆదరణ ఉండే ఆటలో ఫుట్‌బాల్ ది మొదటి స్థానం. ఈ ఆటకు భారత్ లో అంత ఆదరణ లేకపోయినా కానీ ఈ ఆటకు సంబంధించి ఎందోరో అభిమానులు ఉన్నారు. 11 జూన్ 2026 నుండి ఫిఫా వరల్డ్ కప్ కూడా మొదలు కానుంది. ఇప్పటి ఇందులో పాల్గొనే టీమ్స్ దాదాపు ఏవో తెలిసిపోయాయి. ఇది ఇలా ఉండగా.. ఎవరైనా ఫుట్‌బాల్ ఎక్కడ ఆడుతారు చెప్పండి.. గ్రౌండ్ లేదా ఏదైనా ఖాళీ ప్రదేశాలు ఇలా ఏవైనా సరే భూమి మీదే ఆడుతారు కదా.. కానీ తాజాగా కొంతమంది రష్యన్ స్పోర్ట్స్ ప్రేమికులు ఆకాశాన్నంటే సాహసంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఏకంగా 5,900 అడుగుల (సుమారు 1,800 మీటర్లు) ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్‌లకు వేలాడదీసిన వేదికపై వారు మినీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. రష్యన్ ఎక్స్‌ట్రీమ్ అథ్లెట్ సెర్గీ బోయ్‌ట్సోవ్ నేతృత్వంలో జరిగిన ఈ స్టంట్ ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
రూ. 89.99 లక్షల ప్రారంభ ధరతో Lexus RX 350h Exquisite ప్రీమియం కారు లాంచ్.. ఫీచర్స్ ఇవే..!
ఈ అసాధారణ సాహసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్‌పై నిర్వహించిన తొలి ఫుట్‌బాల్ మ్యాచ్‌గా రికార్డులు నమోదు చేసింది. మేఘాల మధ్య వేలాడుతున్న వేదికపై ప్లేయర్లు బాల్‌ను ఒకరికి ఒకరు పాస్ చేస్తూ ఆడటం, గోల్స్ చేయడం లాంటివి రిస్క్‌తో పాటు అద్భుత విజువల్ ట్రీట్‌గా మారాయి. వేల అడుగుల ఎత్తులో ఉన్నందున అందరూ ఆటగాళ్లు ప్రత్యేక భద్రతా పరికరాలు ధరించి మ్యాచ్ ను ఆడారు. ఈ సాహోసోపేతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకుంది.
