NTV Telugu Site icon

Viral Video : అరె ఏంట్రా ఇది.. మనుషులు ఎవరైనా తింటారా..దండం రా బాబు..

Fd Video

Fd Video

సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి.. కొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. కొన్నిసార్లు ఎందుకురా చంపుతారు అని జనాలు సైతం విరక్తి చెంది కామెంట్స్ చేస్తారు.. అయిన అలాంటి వాళ్లు మాత్రం తగ్గలేదు.. వాళ్లు చేసే వంటలను చూస్తే ఇక జన్మలో వాటి జోలికి వెళ్లరు.. తాజాగా అలాంటి వంట వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి చాకోస్ తీసుకున్నాడు.. వాటిని ఒక బౌల్ లోకి తీసుకున్నాడు.. మాములుగా వీటిలో పాలు పోసుకొని తింటారు.. కానీ అతను కొత్తగా చెయ్యాలని అనుకున్నాడు.. తియ్యగా ఉండే చాకోస్ లో స్పైసిగా ఉండే మటన్ కూరను యాడ్ చెయ్యాలని అనుకున్నాడు.. వేడి వేడి మటన్ కూరను చాకోస్ ఉన్న బౌల్ లో పోసి బాగా కలుపుతాడు.. ఇక దాన్ని వీడియో తీస్తు కలుపుతాడు.. అంతేకాదు దాన్ని లొట్టలు వేసుకుంటూ తింటారు.. స్వీట్, హాట్ కాంబినేషన్ ఉన్న ఈ ఫుడ్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది..

ఈ వీడియోను సింగపూర్ ఫుడ్ బ్లాగర్ కాల్విన్ లీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. క్లిప్‌లో లీ తన ముందు తృణధాన్యాల గిన్నెతో కూర్చున్నట్లు చూపిస్తుంది. అప్పుడు అతను మాంసం కూరతో నిండిన మరొక గిన్నె తెచ్చి తృణధాన్యాలపై పోస్తాడు. దాన్ని టేస్ట్ చేయ‌గా.. ఈ కాంబినేష‌న్‌పై త‌న ఫీలింగ్ బాగానే ఉంద‌ని అంటున్నారు.. ఈ వీడియోను చాలా రోజుల క్రితం పోస్ట్ చేశారు.. కానీ ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇది చూసిన వారంతా కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫుడ్ వీడియో వైరల్ అవుతుంది.. మీరు కూడా ఆ అద్భుతమైన వంటను చూసేయ్యండి..