NTV Telugu Site icon

Food Blogger Fined: వైట్ షార్క్‌ను వండి తిన్న పుడ్ బ్లాగర్..శిక్ష విధించిన అధికారులు

Shark

Shark

చైనాకు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్‌కు అక్కడి ప్రభుత్వం దాదాపు రూ.15 లక్షల జరిమానా విధించింది. గ్రేట్ వైట్ షార్క్‌ను అక్రమంగా కొనడమే కాకుండా దానిని వండి తిన్నందుకు ఈ బ్లాగర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారని సమాచారం. సోషల్ మీడియాలో ‘తిజి'(Tizi) పేరుతో పాపులర్‌గా మారిన ఈ బ్లాగర్ పేరు జిన్ మౌమౌ. గతేడాది ఏప్రిల్‌లో ఆమె గ్రేట్ వైట్ షార్క్‌ను కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ షార్క్‌ను వండి, దానిని తిన్న వీడియోను ఆమె జూలైలో చైనాలోని ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్టు చేసింది. దీంతో సీరియస్ అయిన అధికారులు వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ లా ప్రకారం గ్రేట్ వైట్‌షార్క్‌ను కొనడం, వండడం నేరమని ఆమెకు జరిమానా విధించారు. కాగా, వైట్‌షార్క్‌ను అక్రమంగా కలిగి ఉంటే చైనాలో కనీసం ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

వైట్ షార్క్‌ను తింటున్న ఫుడ్ బ్లాగర్

ఆ వీడియోలో ఆ బ్లాగర్ దాదాపు ఆరడుగుల పొడవున్న షార్క్‌తో ఓ స్టోర్‌లో పోజిస్తూ కనిపించింది. ఆమె దాని తలను వండేయగా, దానిని శరీరాన్ని సగానికి చీల్చేసి కాల్చి తినేసింది. ఆ వీడియోలో తిజి మాట్లాడుతూ.. “ఇది మీకు దుర్మార్గంగా అనిపించొచ్చు. నిజానికి దీని మాంసం మృదువుగా, అద్భుతంగా ఉంటుంది” అని చెబుతూ వండిన షార్క్‌ ముక్కలను తింటూ కనిపించింది. దీంతో ఆమెకు ఆ షార్క్‌ను అమ్మిన వ్యాపారి, దానిని పట్టుకున్న జాలరి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రేట్ వైట్ షార్క్‌ను వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది. దీంతో 2020లో చైనా ఈ షార్క్‌ కొనుగోలు, అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది.

TarakaRatna: తారకరత్న గుండె ఆగింది.. కానీ, బాలయ్యే ప్రాణం పోసాడు..?

Show comments