Food Blogger Fined: వైట్ షార్క్‌ను వండి తిన్న పుడ్ బ్లాగర్..శిక్ష విధించిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్‌కు అక్కడి ప్రభుత్వం దాదాపు రూ.15 లక్షల జరిమానా విధించింది. గ్రేట్ వైట్ షార్క్‌ను అక్రమంగా కొనడమే కాకుండా దానిని వండి తిన్నందుకు ఈ బ్లాగర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారని సమాచారం. సోషల్ మీడియాలో ‘తిజి'(Tizi) పేరుతో పాపులర్‌గా మారిన ఈ బ్లాగర్ పేరు జిన్ మౌమౌ. గతేడాది ఏప్రిల్‌లో ఆమె గ్రేట్ వైట్ షార్క్‌ను కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ షార్క్‌ను వండి, దానిని తిన్న వీడియోను ఆమె జూలైలో చైనాలోని ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్టు చేసింది. దీంతో సీరియస్ అయిన అధికారులు వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ లా ప్రకారం గ్రేట్ వైట్‌షార్క్‌ను కొనడం, వండడం నేరమని ఆమెకు జరిమానా విధించారు. కాగా, వైట్‌షార్క్‌ను అక్రమంగా కలిగి ఉంటే చైనాలో కనీసం ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

వైట్ షార్క్‌ను తింటున్న ఫుడ్ బ్లాగర్
Also Read
ఆ వీడియోలో ఆ బ్లాగర్ దాదాపు ఆరడుగుల పొడవున్న షార్క్‌తో ఓ స్టోర్‌లో పోజిస్తూ కనిపించింది. ఆమె దాని తలను వండేయగా, దానిని శరీరాన్ని సగానికి చీల్చేసి కాల్చి తినేసింది. ఆ వీడియోలో తిజి మాట్లాడుతూ.. “ఇది మీకు దుర్మార్గంగా అనిపించొచ్చు. నిజానికి దీని మాంసం మృదువుగా, అద్భుతంగా ఉంటుంది” అని చెబుతూ వండిన షార్క్ ముక్కలను తింటూ కనిపించింది. దీంతో ఆమెకు ఆ షార్క్‌ను అమ్మిన వ్యాపారి, దానిని పట్టుకున్న జాలరి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రేట్ వైట్ షార్క్‌ను వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది. దీంతో 2020లో చైనా ఈ షార్క్ కొనుగోలు, అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది.
TarakaRatna: తారకరత్న గుండె ఆగింది.. కానీ, బాలయ్యే ప్రాణం పోసాడు..?
తాజావార్తలు
-
Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!