Site icon NTV Telugu

Bad Mood : మీ మూడ్ బాగోట్లేదా.. అయితే రోజూ ఇలా చేయండి

New Project (4)

New Project (4)

Bad Mood : ప్రతి మనిషి మానసిక పరిస్థితి మారేందుకు అనేక కారణాలుంటాయి. అతడి జీవనశైలి కావచ్చు. ఆఫీసు టెన్షన్స్ కావొచ్చు.. ఆర్థికపరమైన చికాకులు, ఇంట్లో సమస్యలు ఇందులో ప్రాధాన పాత్ర పోషిస్తాయి. ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి అనేది సహజం.. అందువల దానిని జయించి నడిచినప్పుడే విజయాన్ని చేరువవుతాము. సాధారణంగా అటువంటి పరిస్థితిలో ప్రతి చిన్న విషయానికి కోపంగా ఉంటారు. చికాకు కూడా కలుగుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. మానసిక స్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలో కొన్ని చిట్కాలను అనుసరించండి.

ఉదయాన్నే లేవాలి
రోజువారీగా మేల్కొనే సమయం కంటే 15 నిమిషాల ముందుగా అలారం సెట్ చేసుకోవాలి. 15 నిమిషాల ముందుగానే మేల్కొనడం ద్వారా, మీరు మీ రోజంతా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది రోజులోని అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మీలోని చికాకును కూడా నివారిస్తుంది. ఏమి చేయాలో మీకొక స్పష్టమైన ఆలోచన ఉంటుంది.

Read Also: Bandi Sanjay : రజాకార్ల పాలనను తరిమికొడతా

చిన్న నవ్వు కూడా….
ఉదయాన్నే నిద్ర లేవగానే చిన్నగా నవ్వండి. ఒత్తిడితో, విశ్రాంతి లేకుండా మేల్కొవద్దు. మీ ముఖంపై తేలికపాటి చిరునవ్వు ఉంచండి. ఈ ఉపాయం మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో చాలా దోహదపడుతుంది.

కృతజ్ఞత
ఎదుటి వ్యక్తిని చూడగానే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. నవ్వుతూ పలకరించండి. ఇది ఎదుటి వ్యక్తికి మీ మీద మంచి అభిప్రాయాన్ని కలుగ జేస్తుంది. జీవితంలో ప్రతిదానికీ కృతజ్ఞతతో ఉండండి.

Read Also: Phone In Toilet: టాయిలెట్‎లో ఫోన్ చూస్తే.. తప్పకుండా మీరక్కడికే

సానుకూలత ప్రదర్శించండి
ప్రతికూల స్వీయ-చర్చ మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు. కాబట్టి విధానాన్ని మార్చుకోండి. మీ గురించి బాగా ఆలోచించండి. ఇది మీకు సానుకూలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఎదుటి వ్యక్తి ఏదైనా చెబుతుంటే పూర్తిగా వినండి. మీకు తెలిసినా కూడా వినండి అది చిన్నవారైనా సరే. నాకే తెలుసు అన్న ఆలోచన కాసేపు దూరంపెట్టండి.

నడక
మీకు ఒత్తిడి అనిపిస్తే, కాసేపు బయటికి వెళ్లండి. దీని వల్ల మీరు రిలాక్స్‌గా ఉంటారు. ఇది మీ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీ ఆందోళన తొలగిపోతుంది.

సంగీతం వినండి
మీ మానసిక స్థితిని పెంచడానికి.. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి సంగీతాన్ని వినవచ్చు. ఇది మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. మీరు మీకు ఇష్టమైన పాటలను వినవచ్చు.. హమ్ చేయవచ్చు.

Read Also: INDvsAUS 2nd Test: ఆదుకున్న అక్షర్, అశ్విన్.. టీమిండియా 262 ఆలౌట్

మీ మనస్సును పరిశుభ్రంగా ఉంచుకోండి
ప్రతిరోజూ 5 నిమిషాలు కేటాయించండి. యోగా చేయండి. మీతో కమ్యూనికేట్ చేయడం ద్వారా మీ మనస్సును క్లియర్ చేసుకోండి. ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవడానికి ప్రయత్నించండి.

ఒక మంచి నిద్ర
మీకు మంచి ఆరోగ్యం కావాలంటే మంచి నిద్ర చాలా ముఖ్యం. అందుకోసం ప్రతి వ్యక్తి కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీ మనస్సును ఛార్జ్ చేయడానికి కూడా సహాయపడుతుంది.

Exit mobile version