NTV Telugu Site icon

Gaddar : ధరణి పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది : గద్దర్

Folk Singer Gaddar Fires On Brs Govt

Folk Singer Gaddar Fires On Brs Govt

Gaddar : ధరణి పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు ప్రజా యుద్ధనౌక గద్దర్. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద అలైన్‌మెంట్ మార్చాలని ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలిరోజు దీక్షలో గద్దర్ పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. భూసమస్య తెలంగాణ సమస్య.. నిజాం ఉన్నప్పటి నుంచి ఇక్కడ భూసమస్య ఉందన్నారు. పంట పెట్టుబడి సాయం పేరుతో బంజరు భూములుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని గద్దర్ ఆరోపించారు.

Read Also:Jupally Krishna Rao : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్

పోడు భూములను కార్పొరేట్ కు అప్పగించారని వ్యాఖ్యానించారు. భూమి కోసం ప్రపంచ యుద్ధాలు జరిగాయని గద్దర్ గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా భూ పోరాటాలు జరిగాయన్నారు. తెలంగాణలో గత పదేళ్లుగా రైతులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి సభ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందన్నారు. ఓటు అనే ఆయుధంతో పోరాడి విప్లవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో రైతు చట్టాలు చేస్తే పంజాబ్ రైతులు పోరాడి రద్దు చేశారని.. అదే విధంగా తెలంగాణలో భూసేకరణ విధానాన్ని రద్దు చేద్దాం.. భూములు కోల్పోతున్న రైతులకు భూములివ్వాలని గద్దర్ డిమాండ్ చేశారు.

Read Also:Jr. Ntr: ఫ్యాన్సా.. మజాకా.. ఎన్టీఆర్‌కు హారతి ఇచ్చిన సునిశిత్..