Site icon NTV Telugu

Fire In Metro Station: మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. వెల్డింగ్ చేస్తుండగా మంటలు?

Metro Fire Accident

Metro Fire Accident

Fire In Metro Station: పూణెలోని మండై మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు రాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దాంతో అక్కడి ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన మెట్రో అధికారులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దాంతో ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని ఐదు నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో నీటిని చల్లి మంటలను ఆర్పారు.

Read Also: Bigg Boss 8 Telugu: నాగమణికంఠ అవుట్.. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడంటే?

సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే, మెట్రో స్టేషన్‌లో వెల్డింగ్ పనులు కారణంగా మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. ఇక ఘటనకు సంబంధించి స్థానిక ఎంపీ, కేంద్ర పౌర విమానయాన అండ్ సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ మంటలను ఆర్పివేశారని, ఈ సంఘటన కారణంగా మెట్రో సేవపై ఎటువంటి ప్రభావం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also: Brazil Presiden: బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.. రష్యా పర్యటనకు దూరం..

Exit mobile version