ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఏఐ+ (Ai+) బ్రాండ్‌కు చెందిన 5 పవర్‌పుల్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ, బ్లాక్ మెంబర్ల కోసం ఈ సేల్ రేపటి నుంచే ప్రారంభం కానుండగా, సాధారణ వినియోగదారులందరికీ అక్టోబర్ 9 నుంచి అందుబాటులోకి వస్తుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
ఈ సేల్‌లో లభించే ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి..
ఏఐ+ పల్స్ 2: ఈ సేల్‌లో లభించే అత్యంత చౌకైన ఫోన్ ఇదే. దీని ధర రూ. 8,999గా నిర్ణయించారు. ఇందులో 6.745 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ టి7250 ప్రాసెసర్, 50ఎంపీ వెనుక కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
ఏఐ+ నోవా 2 5జీ: తక్కువ ధరలో 5జీ ఫోన్ కోరుకునే వారి కోసం దీనిని రూ. 11,999 ధరతో అందిస్తున్నారు. ఇందులో మీడియాటెక్ టీ8200 ప్రాసెసర్, 50ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
ఏఐ+ నోవా 2 నియో 5జీ: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 12,999గా ఉంది. ఇందులో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.745 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్, 48ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
ఏఐ+ నోవా 2 ప్రో 5జీ: బ్యాంకు ఆఫర్లతో కలుపుకుని ఈ ఫోన్ రూ. 16,999కి లభిస్తుంది. ఇందులో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 48ఎంపీ వెనుక కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ కెమెరా మరియు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు.
ఏఐ+ నోవా 2 అల్ట్రా 5జీ: ఈ ప్రీమియం మోడల్ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ. 18,999కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 50ఎంపీ + 8ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 13ఎంపీ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

