Site icon NTV Telugu

YSRCP Vs Janasena: నెల్లూరులో ఫ్లెక్సీ వార్‌.. వైసీపీ వర్సెస్‌ జనసేన..

Ysrcp Vs Janasena

Ysrcp Vs Janasena

YSRCP Vs Janasena: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్‌ కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు నెల్లూరు నగరంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనసేన పార్టీ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అనే టైటిల్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పల్లకిలో మోస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్న చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఈ ఫ్లెక్సీలను పెట్టారు.. అయితే, దీనిపై ఆగ్రహించిన జనసేన పార్టీ నాయకులు.. నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పాపం పసివాడు పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 450 కోట్ల రూపాయల అవినీతి ఇసుక గ్రావెల్ రూపంలో అక్రమ సంపాదన పేదల భూములను లాక్కోవడం లాంటి సబ్ టైటిల్స్ ను పెట్టారు.

Read Also: New Parliament: “900 మంది.. 10 లక్షల గంటలు”.. ఇది కొత్త పార్లమెంట్ “కార్పెట్” చరిత్ర..

ఇక, ఈ విషయం తెలియడంతో బాలాజీ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించారు.. అయితే, దీనిని జనసేన పార్టీ నేతలు అడ్డుకొని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే లేని అభ్యంతరం.. ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఫ్లెక్సీలతో పాటు వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా చూస్తే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి ఫ్లెక్సీలనే ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు.. వీటికి కౌంటర్‌గా తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారు..

Exit mobile version