NTV Telugu Site icon

Russia Ukraine War : ఉక్రెయిన్ షెల్లింగ్‌లో ఐదుగురు మృతి.. ఒక జర్నలిస్ట్ అదృశ్యం, రష్యా దాడిలో ఇద్దరికి గాయాలు

New Project 2024 08 26t083046.799

New Project 2024 08 26t083046.799

Russia Ukraine War : రష్యా సరిహద్దు ప్రాంతంలోని బెల్గోరోడ్‌లో ఉక్రేనియన్ షెల్లింగ్‌లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. అయితే రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్‌లోని ఒక హోటల్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు.. ఒక జర్నలిస్ట్ తప్పిపోయినట్లు తెలుస్తోంది. రష్యా ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్‌కోవ్ మాట్లాడుతూ ఉక్రెయిన్ సరిహద్దుకు 38 కిలోమీటర్ల దూరంలోని రష్యా గ్రామమైన రాకిటన్‌లో మరో 12 మంది గాయపడ్డారని, వీరిలో 16 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Read Also:Spinach: పోషకాల పవర్ హౌస్ బచ్చలికూర.. తరుచుగా తింటే ఎన్ని లాభాలో..

ఉక్రెయిన్ ప్రాంతీయ గవర్నర్, వాడిమ్ ఫైలాష్కిన్, రష్యా దళాలు తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలోని క్రామాటోర్స్క్ నగరంలో రాత్రిపూట ఒక హోటల్‌పై దాడి చేశాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మరొక వ్యక్తి శిధిలాల కింద చిక్కుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన జర్నలిస్టులని చెబుతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని కవర్ చేస్తున్న తమ జర్నలిస్టులలో ఒకరు తప్పిపోయారని, మరో ఇద్దరు బృందం సభ్యులు ఆసుపత్రి పాలయ్యారని రాయిటర్స్ వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. హోటల్ సఫైర్‌లో బస చేసిన ఆరుగురు సభ్యుల బృందం శనివారం క్షిపణి దాడికి గురైనప్పుడు ఈ సంఘటన జరిగిందని పేర్కొంది.

Read Also:Release clash: రజినీకాంత్ vs సూర్య.. ఇద్దరిలో తప్పు ఎవరిదంటే..?

రష్యా కాల్పులతో భవనం ధ్వంసం
హోటల్‌తో పాటు సమీపంలోని బహుళ అంతస్తుల భవనం కూడా ధ్వంసమైందని ఫైలాష్‌కిన్ తెలిపారు. ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ సినిహుబోవ్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో ఉక్రెయిన్ తూర్పు ఖార్కివ్ ప్రాంతం కూడా రష్యన్ షెల్లింగ్‌కు గురై అనేక మంది గాయపడ్డారని రాశారు.