NTV Telugu Site icon

Road Accident: రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి

Nursingh Bus Accident

Nursingh Bus Accident

Road Accident: మహారాష్ట్రలోని పూణెలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నాసిక్‌ – పూణే హైవేపై రోడ్డు దాటుతున్న మహిళలను ఎస్ యూవీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు. పూణె నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని షిరోలి గ్రామం సమీపంలో రాత్రి 10.45 గంటలకు 17 మంది మహిళల బృందం క్యాటరింగ్ పని కోసం కల్యాణ మండపానికి చేరుకోవడానికి హైవేను దాటుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలిపారు.

Read Also: Catholic Church : చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు.. మతపెద్దలే నిందితులు

మహిళలను ఢీకొన్న అనంతరం ఎస్‌యూవీ డ్రైవర్ ‌వేగంగా ముందుకు వెళ్లాడు. అనంతరం యూటర్న్ తీసుకుని తిరిగి పూణే వైపు వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్‌యూవీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.