NTV Telugu Site icon

Fisker Ocean EV Launch: ఒక్కసారి చార్జ్ చేస్తే 707 కిమీ ప్రయాణం.. సోలార్ ప్యానెల్ రూఫ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ కారు!

Fisker Ocean Ev

Fisker Ocean Ev

Fisker Ocean Extreme Vigyan Electric SUV Gives 707KM Range: ఇంధన ధరలు పెరగడంతో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రధాన కంపెనీలు మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికన్ ఆటోమోటివ్ కంపెనీ ‘ఫిస్కర్’.. తాజాగా ఇండియన్ మార్కెట్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫిస్కర్ కంపెనీ ఓసెన్ మోడల్‌ను భారత మార్కెట్‌లో విక్రయించబోతోంది.

Fisker Ocean EV Launch:
‘ఫిస్కర్ ఓషెన్’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్ కానుంది. అయితే కేవలం 100 యూనిట్ల కార్లు మాత్రమే ముందుగా రిలీజ్ కానున్నాయి. 2023 సెప్టెంబర్ మాసంలో ఈ కారు ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ కారు మూడు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. స్పోర్ట్, అల్ట్రా, ఎక్స్‌ట్రీమ్ రంగుల్లో ఫిస్కర్ ఓషెన్ ఎలక్ట్రిక్ కారు లభిస్తోంది.

Fisker Ocean EV Range:
ఫిస్కర్ ఓషెన్ ఎలక్ట్రిక్ కారులో రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 113 కేడబ్ల్యూహెచ్‌గా ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇందులో డ్యూయెల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఏర్పాటు చేసింది. ఈ కారు టార్క్ 736 ఎన్, పవర్ 564 పీఎస్‌గా ఉంటుంది. ఇది కేవలం 4 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఫిస్కర్ ఓషెన్ ఎలక్ట్రిక్ కారు ఏకంగా 707 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఇస్తుంది. ఇది భారీ రేంజ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read: Pawan Kalyan-JP Nadda: జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ!

Fisker Ocean EV Solar Roof:
ఫిస్కర్ ఓషెన్ ఎలక్ట్రిక్ కారులో సోలార్ ప్యానెల్ రూఫ్‌ ఉంది. దీని ద్వారా కూడా బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఈ రూఫ్‌ ద్వారా ఏడాదికి 2 వేల కిలో మీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఇందులో 3డీ సరౌండ్ సౌండ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ వంటి అద్భుత ఫీచర్లు ఉన్నాయి.

Fisker Ocean EV Price:
ఫిస్కర్ ఓషెన్ ఎలక్ట్రిక్ కారు ధర దాదాపు రూ. 65 లక్షలుగా ఉంది. యూరోపియన్ మార్కెట్లో ఎక్స్‌ట్రీమ్ వేరియంట్‌కు ఈ రేటు ఉంది. అయితే భారత మార్కెట్‌లో ఈ కారు ధర ఏకంగా ఒక కోటి వరకు ఉండొచ్చని సమాచారం. ఆడి ఇట్రాన్, బీఎండబ్ల్యూ ఐఎక్స్, జాగ్వార్ ఐ ఫేస్ వంటి మోడళ్లకు ఫిస్కర్ ఓషెన్ ఎలక్ట్రిక్ కారు గట్టి పోటీ ఇవ్వనుంది.

Also Read: IND vs WI Dream11 Prediction: భారత్, వెస్టిండీస్‌ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!