NTV Telugu Site icon

Prabhas : మొదటి సారి అలాంటి పాత్ర చేశా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్..

Kalki

Kalki

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

Read Also :Kalki 2898 AD : మధుర లో కల్కి థీమ్ సాంగ్ రివీల్..

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాలకే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి.ఈ సినిమా రిలీజ్ కు ఇంకా మూడు రోజులు ఉండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు.తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ ,ప్రభాస్ , దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ వీడియో రిలీజ్ చేశారు.
చిట్ చాట్ లో మూవీ టీమ్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసారు. హీరో ప్రభాస్ మాట్లాడుతూ బాహుబలి తర్వాత మళ్ళీ కామెడీ ఈ సినిమాలోనే చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో నేను చేసిన భైరవ పాత్రలో కొంచెం నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి.మొదటిసారి నేను ఇలాంటి పాత్ర చేస్తున్నాను.ఈ పాత్ర నా కెరీర్ లోనే దీ బెస్ట్ అని ప్రభాస్ తెలిపాడు. దీంతో ప్రభాస్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.