NTV Telugu Site icon

Solar Eclipse 2025: ఎల్లుండే సూర్యగ్రహణం.. గ్రహణ సమయంలో ఈ తప్పు చేయకండి!

Solar Eclipse

Solar Eclipse

దాదాపు 15 రోజుల క్రితం చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న సంభవించనుంది. ఖగోళ సంఘటనలపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు మార్చి 29 చాలా ప్రత్యేకమైన రోజు. సూర్యగ్రహణం అనేది సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవించే ఒక ఖగోళ దృగ్విషయం. ఇది ఉత్తర అమెరికాతో పాటు పశ్చిమ ఐరోపా, వాయువ్య ఆఫ్రికా, రష్యాలో కనిపిస్తుంది.

Also Read:Dhanraj : 15 ఏళ్లకే పెళ్లి.. ఆ సినిమాతో సర్వం కోల్పోయాంః ధన్ రాజ్ భార్య

శనివారం సంభవించే సూర్యగ్రహణం కళ్ళకు ప్రమాదకరమని పరిశీలకులు అంటున్నారు. గ్రహణం సమయంలో సూర్యుడిని వీక్షించడానికి సోలార్ ఫిల్టర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఈ గ్రహణం భారత్ లో కనిపించదు. సూర్యగ్రహణం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల 17 నిమిషాలకు పతాక స్థాయికి చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు ముగుస్తుంది.