NTV Telugu Site icon

DilRuba : ‘దిల్ రూబా’ ఫస్ట్ సింగిల్ కు డేట్ ఫిక్స్

New Project (16)

New Project (16)

DilRuba : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మధ్యే ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. గతేడాది ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అలాగే తన కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా వచ్చిన “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అటు పర్సనల్ లైఫ్, ఇటు సినీ లైఫ్ సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు కిరణ్. అదే జోష్ తో ఈ యంగ్ టాలెంటెడ్ మరో కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు.

Read Also:Astrology: జనవరి 16, గురువారం దినఫలాలు

కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమా ‘దిల్ రూబా’. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. “క” సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మేకర్స్ రూపొందిస్తున్నారు.

Read Also:TDP vs YCP: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. బనగానపల్లెలో ఉద్రిక్తత!

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘అగ్గిపుల్లే’ అనే పాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ పాటను జనవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండటం తో ఈ పాట ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ రుక్సర్ ధిల్లోన్ హీరోయిన్‌గా నటిసున్నారు. ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Show comments