NTV Telugu Site icon

DNA From Three People: ముగ్గురు వ్యక్తుల డీఎన్‌ఏతో జన్మించిన శిశువు.. ఇదే మొదటిసారి!

Baby

Baby

First Baby With DNA From Three People Born In The UK: యూకేలో ఓ సంచలనాత్మక శాస్త్రీయ పద్ధతిలో ముగ్గుల వ్యక్తుల డీఎన్‌ఏతో సృష్టించబడిన మొదటి శిశువు జన్మించింది. ఈ ప్రక్రియలో 99.8శాతం డీఎన్‌ఏ ఇద్దరు తల్లిదండ్రుల నుంచి వస్తుందని, మిగిలినది మహిళా దాత నుంచి వస్తుంది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రయత్నంగా ఈ సరికొత్త పద్ధతిలో ముగ్గురి వ్యక్తుల డీఎన్‌ఏతో మొదటి శిశువు జన్మించింది.

మైటోకాండ్రియల్ వ్యాధులు నయం చేయలేనివి. కావున శిశువు పుట్టిన గంటలు లేదా కొద్ది రోజులకే అవి ప్రాణాంతకం కావచ్చు. చాలా మంది కుటుంబాలు అనేక మంది పిల్లలను ఇలాగే కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీ శిశువులను రక్షించేందుకు ఉత్తమ ఎంపికగా భావించవచ్చు. . కణాలలో జరిగే అనేక జీవన క్రియా చర్యలకు అవసరమైన శక్తిని మైటోకాండ్రియాలు సిద్ధం చేసి ఉంచుతాయి. అందువల్ల వీటిని కణం యొక్క ‘శక్త్యాగారాలు’ అని వర్ణిస్తారు. లోపభూయిష్ట మైటోకాండ్రియా శరీరానికి శక్తి అందించడంలో విఫలమవుతుంది. దీని వల్ల మెదడు దెబ్బతినడం, కండరాల క్షీణత, గుండె వైఫల్యం. అంధత్వానికి దారితీస్తుంది. మైటోకాండ్రియాలు బిడ్డకు తల్లి ద్వారా మాత్రమే అందుతాయి. కాబట్టి మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్‌మెంట్ అనేది ఆరోగ్యకరమైన దాత అండం నుంచి మైటోకాండ్రియాను ఉపయోగించే ఐవీఎఫ్‌ యొక్క సవరించిన రూపం. దీని వల్ల శిశువుల్లో మైటోకాండ్రియాలు అభివృద్ధి చెంది.. పిల్లలు ఆరోగ్యంగా పుట్టేలా సహకరిస్తుంది.

ఇతర మహిళా దాత డీఎన్‌ఏ ప్రభావవంతమైన మైటోకాండ్రియాను తయారు చేయడానికి మాత్రమే సంబంధించినది. ఆ దాత డీఎన్‌ఏ ఇతర లక్షణాలను ప్రభావితం చేయదు. ఈ సాంకేతికత న్యూకాజిల్‌లో ప్రారంభించబడింది. 2015లో యూకేలో ఇటువంటి పిల్లలను సృష్టించేందుకు చట్టాలు ప్రవేశపెట్టబడ్డాయి.