Site icon NTV Telugu

Fire in Ferry: నడి సముద్రంలో షిప్‌లో భారీగా మంటలు.. 280కి పైగా ప్రయాణికులు.. చివరికీ..

Ferry Fire

Ferry Fire

ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తున్న ఫెర్రీ(ఓడ)లో మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు సముద్రంలోకి దూకారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓడ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఆకాశంలో నల్లటి పొగ ఎగసిపడుతోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ఓడ పేరు KM బార్సిలోనా VA. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే.. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.. స్థానిక మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రయాణికులు, సిబ్బంది సహా 284 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో నౌకలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గాయపడిన వారెందరు? అనే విషయాలపై స్పష్టత లేదు.

READ MORE: Maharashtra: భూతవైద్యం పేరుతో ‘‘మూత్రం’’ తాగించాడు, పరారీలో బాబా..

అయితే.. ఇండోనేషియాలోని తలౌడ్‌ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్సు రాజధాని మనాడోకు ఈ ఫెర్రీ బయలుదేరినట్లు చెబుతున్నారు. తలిసే ప్రాంతానికి చేరుకుంది. అక్కడ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు, కొందరు తమ పిల్లలతో కలిసి మంటల నుంచి తప్పించుకోవడానికి సముద్రంలోకి దూకుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సేఫ్టీకి జాకెట్‌లు ఉండటంతో చాలా మంది బతికి బయటపడ్డారు. లేదంటే.. నీటిలో మునిగి మృత్యువాత పడేవారు.

READ MORE: Ustad Bhagat Singh : అలా చేస్తే చట్టపరమైన చర్యలు.. వాళ్లకు ‘మైత్రీ’ వార్నింగ్..

Exit mobile version