Site icon NTV Telugu

Bihar: పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో అగ్నిప్రమాదం.. తగలబడ్డ బోగీలు

Dkek

Dkek

పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీహార్‌లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఉండగానే రైలు తగలబడింది. రెండు రైలు కోచ్‌లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా? ఎంత ఆస్తి నష్టం జరిగింది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Exit mobile version