NTV Telugu Site icon

Fire Accident: లక్నో ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి

Laknow

Laknow

ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆపరేషన్‌ థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారి మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ మ‌హిళ స‌ర్జరీ నిమిత్తం పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ హాస్పిట‌ల్‌లో చేరింది. మ‌రో చిన్నారి కూడా హర్ట్ సర్జరీ కోసం ఇదే హాస్పిటల్‌లో చేరింది. వారిద్దరికి సోమవారం వైద్యులు సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆపరేషన్ థియేటర్లో వారికి సర్జరీ జరుగుతుండగా ఆకస్మాత్తుగా అక్కడ అగ్ని కీలలు ఎగిసిపడటంతో ఆందోళనకు గురైన వైద్యులు బయటకు పరుగులు తీశారు.

Also Read: Rapido: యువతితో ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. సంస్థ రియాక్షన్ ఇదే..

దీంతో ఆపరేషన్ మధ్యలో ఆగిపోవడంతో సదరు మహిళ, చిన్నారి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి చేరుకున్నారు. అనంతరం అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడ చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి సహాయక చర్యలు చేపట్టింది. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. వైద్యులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ వారు మరణించారని వాపోతున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు.

Also Read: Congress PAC: పీఏసీ కన్వీనర్ సమావేశం.. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తీర్మానం

Show comments