NTV Telugu Site icon

Vietnam: అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు.. 50 మందికి పైగా సజీవ దహనం

Fire Accident

Fire Accident

Fire Accident in Apartments  in Vietnam: ఓ తొమ్మిది అంతస్తుల భవంతిలో చెలరేగిన మంటల కారణంగా 50 మందికి బలైపోయారు. కొన్ని కుటుంబాలు చిద్రమైపోయాయి. అరుపులు, కేకలు, మంటలతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. రాత్రి సమయం కొంతమంది నిద్రలో ఉన్నారు. కొంతమంది కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. మరి కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ లోపలే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఎక్కడి వారిని అక్కడ చెల్లాచెదురు చేశాయి. తొమ్మిది అంతస్తుల భవనం మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ భారీ అగ్ని ప్రమాదం వియత్నాంలోని హనోయిలో జరిగింది.

Also Read: Libiya: లిబియాలో వరద బీభత్సం.. 5,300 కి పైగా చేరుకున్న మరణాలు

వివరాల ప్రకారం ఓ తొమ్మిది అంతస్తుతల భవంతిలో నిన్న రాత్రి రాత్రి 11.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వియత్నాంలోని హనోయిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 50 మందికి పైగా జనాలు ప్రాణాలు కోల్పొయారు. రాత్రి సమయం కావడంతో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. ప్రమాదం సంభవించిన భవనంలో ప్రస్తుతం 45 కుటుంబాలు నివాసిస్తున్నాయి. భవనం ఇరుకు సందులో ఉండడంతో సహాయక చర్యలు అందించడం కూడా కష్టంగా మారింది. చాలా మంది మంటల్లో చిక్కుకొని బయటకు రాలేకపోయారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఆసుపత్రిలో చేర్పించగా వారిలో 54 మంది ఇప్పటి వరకు మరణించినట్లు అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. రాత్రి సమయం కావడంతో ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఏ కారణంతో అపార్ట్ మెంట్ లో మంటలు అంటుకున్నాయి అన్న దానిపై స్పష్టత లేదు. అయితే మంటలు అంటుకున్న వారి హహాకారాలతో ఆ ప్రాంతం భీతావాహంగా మారింది.

ఇక ఇటీవల ప్రమాదాలు, విపత్తుల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పొయారు. మొరాకోలో భూకంపం సంభవించి 2500 మందికి పైగా చనిపోయారు. లిబియాలో వరదల కారణంగా 5300 మందికి పైగా మరణించారు. ఇవి విపత్తులు అనుకుంటే ఇప్పుడు వియత్నం అగ్ని ప్రమాదంలో కూడా 50 మందికి పైగా సజీవ సమాధి కావడం అత్యంత విచారకరం.

 

 

Show comments