Find Lost Phone In Silent Mode: మీ మొబైల్ లో రింగింగ్ శబ్దంతో మీరు డిస్టర్బ్ అయ్యి సైలెంట్ మోడ్‌లో పెట్టడం చాలా సార్లు చేస్తూనే ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్‌ని ఎక్కడో ఉంచి మరిచిపోతే దొరకడం కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిలో మరొక ఫోన్ నుండి రింగ్ చేయడం చేసిన పెద్దగా ఫలితం ఉండదు. మీ సమస్యను పరిష్కరించడానికి అద్భుతమైన మొబైల్ యాప్ లను చూద్దాం. వీటి ద్వారా ఫోన్ స్వయంచాలకంగా ఈలలు, చప్పట్లు కొట్టడం ద్వారా ఎక్కడ ఉందొ కనుక్కోవచ్చు.
T20 World Cup 2025: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. వెస్టిండీస్‌తో భారత్ తొలి మ్యాచ్!
విజిల్ ఫోన్ ఫైండర్ అనేది మీ పోగొట్టుకున్న ఫోన్‌ని నిమిషాల్లో గుర్తించే అద్భుతమైన యాప్. మీరు ఈ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సైలెంట్ మోడ్‌లో మీ ఫోన్ ఎక్కడో పోయినప్పుడు మీరు చేయాల్సిందల్లా విజిల్ వేయడమే. మీ ఫోన్ ఎక్కడ ఉంచినా అది సౌండ్ చేయడం ప్రారంభిస్తుంది. ఇంకా ఫోన్ లోని కెమెరా లైట్ కూడా ప్రకాశవంతంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు చీకటిలో కూడా మీ మొబైల్ ను సులభంగా కనుగొనగలుగుతారు.
T20 World Cup 2025: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. వెస్టిండీస్‌తో భారత్ తొలి మ్యాచ్!
సైలెంట్ మోడ్‌లో కోల్పోయిన ఫోన్‌ను కనుగొనడంలో క్లాప్ టు ఫైండ్ యాప్ చాలా సహాయపడుతుంది. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఇది మొబైల్ డేటా లేదా Wi-Fi లేకుండా పని చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ ను డౌన్‌లోడ్ చేసి దశలను అనుసరించడం ద్వారా దాన్ని సెటప్ చేయండి. మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో పోయినప్పుడల్లా చప్పట్లు కొట్టడం. మీరు దీన్ని చేసిన వెంటనే ఫోన్ మోగడం ప్రారంభమవుతుంది. మీరు దీన్ని సులభంగా కనుగొనవచ్చు.
