NTV Telugu Site icon

Minister Bhatti: ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశం

Batti 2

Batti 2

సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే.హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్.రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ, వ్యయం, రాష్ట్ర అప్పుల గురించి మంత్రికి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సంపద సృష్టించడం, సృష్టించిన సంపద ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు.. ఆదాయ వనరుల అన్వేషణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలని తెలిపారు. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖ పైన ఆధారపడి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఉద్యోగస్తుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న కమిట్మెంట్ తో.. మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి.. ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారని తెలిపారు.

Srilanka: అంధకారంలో శ్రీలంక దేశం.. సిస్టమ్ ఫెయిల్యూర్‌తో విద్యుత్ అంతరాయం..

తెలంగాణ రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది.. అయినప్పటికీ చాలెంజ్ గా ఈ శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని మంత్రి భట్టి పేర్కొన్నారు. అనేక సవాళ్ళను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని మనందరం కలిసికట్టుగా సాధిద్దామన్నారు. రాష్ట్రంలో తన పాదయాత్ర చేసిన సందర్భంగా.. అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించి వారి సమస్యలను పరిష్కరించడానికి ఆరు గ్యారెంటీలు అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించామని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశానన్నారు. ఉచితాలు ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వడం లేదు.. హ్యూమన్ రిసోర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామని భావించాలని అన్నారు.

Animal : బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న యానిమల్ కలెక్షన్ల పరంపర..

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా మహాలక్ష్మి పథకం ప్రారంభించి.. అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఆరోగ్య తెలంగాణగా.. ఈ రాష్ట్రం ఉండాలని ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి నేటి నుంచి అమలు చేస్తున్నామని చెప్పారు. మిగతా గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.

Show comments