గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పోకిరి సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది .టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇలియాన ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలోఈ భామ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. దీంతో ఈ భామ టాలీవుడ్ ఆఫర్స్ కొల్పోయింది. బాలీవుడ్ లో వరుస ప్లాప్స్ రావడంతో అక్కడ ఎవరు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత లవ్ బ్రేక్ అప్ కారణంగా ఇలియాన కొంతకాలం డిప్రెషన్ కు గురైంది. ఇలియాన కొంతకాలం పాటు మీడియాకు దూరంగా ఉంది. కొన్నెళ్ల పాటు సైలెంట్ అయిన ఆమె సడన్ గా తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించి అందరికి షాకిచ్చింది.అయితే ఇలియానా పెళ్లి గురించి ఆమెకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిపై ఇలియానా ఎప్పుడు కూడా స్పందించలేదు.దీంతో ఇలియాన పెళ్లి కాకుండానే తల్లయిందంటూ ఆమెను తెగ ట్రోల్ చేశారు.
అయినా కూడా ఇలియానా ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. ఇక తన బిడ్డ పేరు ఫీనిక్స్ డోలన్ అని కూడా ఆమె తెలిపింది..బిడ్డ పుట్టిన కూడా తన పార్ట్నర్ గురించి చెప్పకపోవడంతో ఇలియానాఫై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి అయితే చివరకి తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ డోలన్ అంటూ ఆమె పరిచయం చేసింది.అయితే వారిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఈక్రమంలో తాజాగా మైఖేల్తో పెళ్లిపై ఇలియాన క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో తన లైఫ్ పార్ట్నర్ మైఖేల్ గురించి చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యింది.ఈ రిలేషన్ షిప్ లో మైఖేల్ సపోర్ట్ ఎలా ఉందని అడగగా మైఖేల్ తో తన వైవాహిక జీవితం చాలా అందంగా సాగుతుందని ఆమె బదులిచ్చింది.నేను ఆనందంగా వున్న సమయంలోను,అలాగే నేను డిప్రెషన్ లో వున్న సమయంలోను మైఖేల్ నాకు తోడుగా నిలిచాడు.అతడిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను అంటూ ఇలియాన భావోద్వేగానికి లోనైంది.దీనితో పెళ్లి తరువాతే ఇలియాన తల్లి అయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు .
