NTV Telugu Site icon

Game Changer : ఎట్టకేలకు “గేమ్ ఛేంజర్” షూటింగ్ పూర్తి కాబోతుందిగా..

Gamechanger

Gamechanger

Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా ఇంకా పూర్తి కాలేదు.

Read Also :Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ షూటింగ్ అప్డేట్ వైరల్..?

దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఎట్టకేలకు ఇండియన్ 2 సినిమా రిలీజ్ కు సిద్ధం కావడంతో దర్శకుడు శంకర్ తన ఫోకస్ అంతా కూడా “గేమ్ ఛేంజర్ ” షూటింగ్ పై పెడుతున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు.అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కూతురు ప్రకటించారు.త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు .

Show comments