Jawan Movie Wins Best Action in Filmfare Awards 2024: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలు గుజరాత్‌తో శనివారం అట్టహాసంగా ఆరంభం అయ్యాయి. టెక్నికల్ అవార్డ్స్ విజేతలను శనివారం ప్రకటించారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఉత్తమ యాక్షన్ సినిమాగా నిలిచింది. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాకు ఉత్తమ కొరియోగ్రఫీ దక్కింది. వాట్ ఝుమ్కా పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఉత్తమ నేపథ్య సంగీతం యానిమల్ (హర్షవర్ధన్ రామేశ్వర్)ను వరించింది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు రెండు రోజుల ఈవెంట్‌గా మొట్టమొదటిసారిగా జరుగుతోంది. టెక్నికల్ అవార్డుల వేడుక జనవరి 27న జరిగింది. టెక్నికల్ అవార్డులకు అపర్‌శక్తి ఖురానా హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రధాన ఈవెంట్ జనవరి 28న (ఆదివారం) జరగనుంది. కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా మరియు మనీష్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024కి రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సహా మరెంతో మంది స్టార్స్ హాజరుకానున్నారు.
Also Read: Fighter: 14వ సారి 100 కోట్ల క్లబ్‌లోకి హృతిక్ రోషన్.. లిస్ట్ ఇదే!
టెక్నికల్ అవార్డుల విజేతలు:
ఉత్తమ యాక్షన్ – జవాన్
ఉత్తమ నేపథ్య సంగీతం – హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
ఉత్తమ కొరియోగ్రఫీ – గణేష్ ఆచార్య (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – అవినాష్ అరుణ్ ధావేర్ ISC (త్రీ ఆఫ్ అస్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – సచిన్ లవ్లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
ఉత్తమ ఎడిటింగ్ – జస్కున్వర్ సింగ్ కోహ్లీ మరియు విధు వినోద్ చోప్రా (12వ ఫెయిల్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సుబ్రతా చక్రవర్తి మరియు అమిత్ రే (సామ్ బహదూర్)
ఉత్తమ సౌండ్ డిజైన్ – కునాల్ శర్మ (సామ్ బహదూర్) మరియు సింక్ సినిమా (యానిమల్)
ఉత్తమ వీఎఫ్ఎక్స్- రెడ్ చిల్లీస్ (జవాన్)