బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమా చేస్తున్నాడు.. అనేక యాడ్ లలో కనిపిస్తుంటాడు.. ఇక ఈయన తాజాగా నటించిన చిత్రం గురించి తెలిసిందే.. బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది..సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బేస్ట్ యాక్షన్ డ్రామాలో అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.. అనిల్ కపూర్, అలాగే బిపాసా భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలోకి విడుదలైన ఈ దేశ భక్తి కు పాజిటివ్ టాక్ వచ్చింది.
అంతేకాదు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా ఫైటర్ రూ. 350 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఫైటర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే అనుకున్న సమయానికన్నా ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని తెలుస్తుంది.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఏకంగా రూ. 180 కోట్ల రేటుకు దక్కించుకుందట. ముందస్తు ఒప్పందం ప్రకారం మార్చి 4వ వారంలో హృతిక్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురావాలనుకున్నారట.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మార్చి 2వ వారంలోనే ఫైటర్ ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ వినిపిస్తోంది. వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు భారీ బడ్జెట్ తో అత్యత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇందులో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజిదా షేక్, అశుతోష్ రాణా, రిషబ్, తదితరులు నటించారు..