Fighter :అబ్బురపరిచే విజువల్స్ తో హృతిక్ ‘ఫైటర్’ ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న యాక్షన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఫైటర్”.సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 25 రిపబ్లిక్ డే కు విడుదల చేయబోతున్నారు..
లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గా మరచిపోలేని నటన కనబరిచారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా ఫైటర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫైటర్ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టైలర్ లో హృతిక్ రోషన్ పాత్రని షంషేర్ పఠానియ అలియాస్ పాట్టిగా అభిమానులకు పరిచయం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ డ్రాగన్స్ అనే స్పెషల్ టీమ్ కి లీడర్ గా హృతిక్ రోషన్ కనిపిస్తున్నాడు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రైలర్ లో హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్, చెబుతున్న డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. యాక్టన్, ఎమోషన్ కలగలిపి హృతిక్ ఇస్తున్న పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో హీరో లుక్స్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి. ఫైటర్ జెట్ పైలెట్ గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు ఊపిరి సలపని అనుభూతిని పంచుతున్నాయి. 2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందుకు అనుగుణంగా హృతిక్ పాట్టి పాత్రని తీర్చిదిద్దారు. పుల్వామా అటాక్ సన్నివేశాలు.. దానికోసం తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉంటూ ప్రేక్షకుల హృదయాల్ని బలంగా తాకుతున్నాయి. సినిమా రిలీజ్ కి ఒక వెల్కమ్ సెలెబ్రేషన్స్ లాగా ట్రైలర్ ని నెటిజన్లు సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరు రోజు ముందే అంటే జనవరి 25న ఫైటర్ చిత్రం రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ చిత్రం ఇదే. ఫైటర్ మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందించారు. నెవర్ బిఫోర్ అనిపించే సినిమాటిక్ అనుభూతిని అందిస్తానని కూడా ఆడియన్స్ కి ప్రామిస్ చేశారు. ఫైటర్ చిత్రం ఏరియల్ యాక్షన్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఆసక్తిని పెంచుతోంది.ఫైటర్ ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ప్రేక్షకులకు అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Wishing all you beautiful people a very Happy Makar Sankranti, joyful Uttarayan & a prosperous Pongal! ♥️
— Hrithik Roshan (@iHrithik) January 15, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!