FIFA World Cup 2026 Schedule: ఫిఫా ప్రపంచ కప్-2026కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా వచ్చేసింది. 39 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీ జూన్ 11న స్టార్ట్ అయ్యి – జులై 19న వరకు కొనసాగనుంది. 2026 ఫిఫా ప్రపంచ కప్‌కు కెనడా, మెక్సికో, యుఎస్‌ఏ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్‌లో 32 దేశాలే పోటీపడ్డాయి, కానీ ఈసారి 48 దేశాలు పోటీపడబోతున్నాయి. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్‌లు జరగనున్నాయి.
READ ALSO: Vivo V60e: వివో 5G ఫోన్ కేవలం రూ.29,499కే.. 200MP కెమెరా, డైమెన్సిటీ టర్బో ప్రాసెసర్..
టోర్నీలో పాల్గొనే 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు దేశాలు ఉంటాయి. ఇంకా ఆరు స్థానాలు ఖరారు కాలేదు. దీని కోసం ఇటలీ సహా పలు దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జూన్ 11 – 27, రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు జూన్ 28 – జులై 2, రౌండ్ ఆఫ్ 16 జులై 4 – 7, క్వార్టర్ ఫైనల్స్ జులై 9 – 11, సెమీ ఫైనల్స్ జులై 14 -15, జులై 18న కాంస్య పతక పోటీ, జులై 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ మెక్సికో, సౌతాఫ్రికా మధ్య ఉంది. ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ అమెరికాలోని ది మెట్‌లైఫ్ స్టేడియం (న్యూయార్క్ న్యూ జెర్సీ స్టేడియం)లో జరగనుంది. జూన్ 16న డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన తొలి మ్యాచ్ అల్జీరియాతో తలపడనుంది.
READ ALSO: Sukumar: డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం కథను ఫస్ట్ ఇతనికే చెప్పాడు..
