FIFA World Cup 2026 Final: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ముగిసిన వెంటనే మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన అర్జెంటీనా జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో ఘర్షణకు దిగడంతో ఫుట్‌బాల్ మైదానం కాసేపు యుద్ధ రంగంగా కనిపించింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడులకు దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0తో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లలో ఓటమి నిరాశ స్పష్టంగా కనిపించింది. మొదట మాటలతో మొదలై, ఆ తర్వాత తోపులాట వివాదం జరిగిన కొద్దిసేపటికే తీవ్ర ఘర్షణగా మారింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు చేతులు కూడా చేసుకున్నారు.
అక్కడి పరిస్థితి అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ.. అక్కడ కొద్దీసేపు తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడెస్ స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్నట్లు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఘర్షణకు కారణమైన లియాండ్రో పరేడెస్‌కు రెడ్ కార్డు చూపిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో రెడ్ కార్డు అందుకున్న రెండో ఆటగాడిగా పరేడెస్ నిలిచాడు. అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జెంటీనా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు.
it’s all batshit but the part when Paredes goes from kicking a player to the ground to calmly pleading his case to the referee who has clearly just seen him kick a player to the ground to punching that same player is reeeeally sticking with me. pic.twitter.com/xp6jm12OQG
— amadí (@amadoit__) July 20, 2026

