Site icon NTV Telugu

Federal Reserve Rate Cut: ఉపాధి ఆందోళనల మధ్య ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత.. ఎంతంటే?

Frdaral Rates

Frdaral Rates

Federal Reserve Rate Cut: చాలా రోజుల తర్వాత ఫెడరల్ రిజర్వ్ దాని బెంచ్‌మార్క్ వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. ఈ విషయమై ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం వినియోగదారులకు రుణాలు మరింత అందుబాటులోకి రావడానికి ఇది తొలి అడుగు కావచ్చని అంటున్నారు. ఫెడ్ చైర్ పావెల్ ఈ తగ్గింపును ఉపాధికి ఉన్న ప్రమాదాలను నివారించడానికి తీసుకున్న “రిస్క్ మేనేజ్మెంట్ కట్” అని వర్ణించారు. అయితే, ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఫెడ్ లక్ష్యం అయిన 2% కంటే ఎక్కువగా ఉంది. సాధారణంగా, ఇలాంటి పరిస్థితుల్లో రేట్లను పెంచడం లేదా స్థిరంగా ఉంచడం జరుగుతుంది. అయితే, ఈసారి ఫెడ్ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు “రిస్క్ ఫ్రీ మార్గం” లేదని పావెల్ అంగీకరించారు.

AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బొండా ఉమ ఆగ్రహం!

మార్కెట్ బలహీనపడుతున్న సంకేతాలను చూపడంతో ఈ నిర్ణయం వెలువడింది. ఫెడ్ తాజా ప్రకటనలో శ్రామిక మార్కెట్ పటిష్టంగా ఉందని పేర్కొనలేదు. ఉద్యోగాల వృద్ధి మందగించిందని చెప్పింది. భవిష్యత్ రేట్ల తగ్గింపులపై ఫెడ్ అధికారుల మధ్య విస్తృత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఫెడ్ ప్రచురించిన త్రైమాసిక “డాట్ ప్లాట్” చార్ట్ ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు సార్లు రేట్లు తగ్గించవచ్చని అంచనా.

Nellore : నెల్లూరులో విషాదం.. ట్రక్ ఢీకొట్టగా ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది మృతి!

ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ డిప్యూటీ చీఫ్ U.S. ఎకనామిస్ట్ మైఖేల్ పియర్స్ ప్రకారం.. వినియోగదారులపై దీని తక్షణ ప్రభావం పెద్దగా ఉండదని తెలిపారు. కేవలం పావు శాతం తగ్గింపు వల్ల రుణగ్రహీతలకు పెద్ద తేడా ఉండదు. కానీ, ఫెడ్ రేట్లను తగ్గిస్తూపోతే.. వచ్చే ఏడాది నాటికి క్రెడిట్ కార్డ్‌లు, వాహన రుణాల వంటి వాటిపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండవచ్చని ఆయన అన్నారు. తక్కువ వడ్డీ రేట్లు రుణ ఆమోద రేట్లను కూడా పెంచగలవని ఆయన చెప్పారు.

Exit mobile version