Site icon NTV Telugu

Kerala: కన్నకొడుకు కుటుంబాన్ని నిప్పుబెట్టి చంపిన తండ్రి.. ఆ తరువాత

Fire

Fire

Father Killed his Son’s Family in Kerala: కన్న తండ్రి మమకారం మరిచి కసాయిలా మారిపోయాడు.  ఇంట్లో జరిగే గొడవలు ఎక్కడైనా సహజం అని తెలిసినా ఆ వ్యక్తి విచక్షణా కోల్పొయాడు. కన్న కొడుకు మీదే పగ తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఆ  వ్యక్తి కన్న కొడుకు కుటుంబాన్నే కడతేర్చాడు. నిద్రిస్తున్న వారి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో కొడుకు, మనవడు చనిపోగా కొడలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో వెలుగుచూసింది.

Also Read: Pakistan: పీఓకేలో ఉగ్రవాదులకు పాక్ సాయం.. చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ

జాన్సన్ అనే వ్యక్తి తన కొడుకు జోజి (38) కలిసి ఉంటున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా జాన్సన్ ఏకంగా తన కొడుకు కుటుంబాన్ని మొత్తాన్ని మట్టుబెట్టాలని చూశాడు వారు నిద్రిస్తున్న సమయంలో వారి మీద పెట్రోల్ చల్లి నిప్పు బెట్టాడు. నిద్రలో ఉండటం వల్ల వారు దీనిని పసిగట్టలేకపోయారు. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో నిందితుడి కొడుకు జోజి, మనవడు(12) అక్కడికక్కడే చనిపోయారు. కోడు లిజీ మాత్రం 50 శాతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతుంది. అర్థరాత్రి ఈ సంఘటన జరగడంతో వారు తప్పించుకోలేకపోయారు. అయితే వారి కేకలు, అరుపులు విన్న పక్కింటి వారు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కోడలిని వెంటనే ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అయితే వారికి నిప్పు పెట్టిన నిందితుడు జాన్సన్ కూడా విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని కూడా ఆసుపత్రిలో చేర్పించారు. అతడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. జాన్సన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే జాన్సన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఇంతటి దారుణానికి నిందితుడు పాల్పడటానికి కారణం కుటుంబ కలహాలే అని పోలీసులు తెలిపారు.

 

 

Exit mobile version