Site icon NTV Telugu

Tragedy : కేరళలో విషాదం.. తెల్లారే సరికి దూలానికి తండ్రి, బకెట్లో కొడుకు శవాలు

Murder

Murder

Tragedy : కేరళలో విషాదం చోటు చేసుకుంది. తెల్లారి లేచి చూసిన భార్యకు భర్త, కొడుకు శవాలు కనిపించడంతో షాక్ తిన్నది. వివరాలు.. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూరు పరిధిలో బినోయ్ లాటరీ అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. బినోయ్ కు ఇద్దరు కొడుకులు. అతడు ఒక ప్రవాసి. త్రిసూర్‌లోని ఆలూర్‌లో బినోయ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. పెద్ద కొడుకు, భార్య ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున నిద్ర లేచి చూసే సరికి కొడుకు బకెట్‌లో శవమై, బెనోయ్ ఉరివేసుకుని కనిపించాడు.

Read Also: MLC Kavitha: బెదిరింపు వ్యూహాలు మమ్మల్ని అడ్డుకోలేవు.. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తా..

కుమారుడిని చంపిన తర్వాత బినోయ్ ఉరివేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. చిన్న పిల్లవాడికి మాటలు రావు. ఆర్థిక సమస్యల కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండివచ్చనే అనుమానాలున్నాయి. ఆపదలో ఇలాంటి పని చేసి ఉంటారని భావిస్తున్నారు. బినోయ్ మొదట కుమారుడిని చంపి బకెట్లో పడేసి ఆ తర్వాత ఉరివేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:Anantapur Police: రాప్తాడు హైవేపై హవాలా డబ్బు.. అనంతపురం పోలీసులు అదుపులో కేరళ గ్యాంగ్

Exit mobile version