Site icon NTV Telugu

Mahabubabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు లారీలు.. ముగ్గురు మృతి

Ac

Ac

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యారు. ఖమ్మం – వరంగల్ మధ్య జాతీయ రహదారిపై రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా క్యాబిన్‌లో మంటలు చేలరేగి ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ సజీవ దహనం అయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:One Big Beautiful Bill: ట్రంప్ కు భారీ విజయం.. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం

విజయవాడ నుంచి పౌల్ట్రీ మెటీరియల్ లోడ్ తో గుజరాత్‌కు వెళ్తోన్న ఒక లారీ.. గ్రానైట్ లోడ్ లారీ వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తోన్న మరో లారి ఢీకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ దగ్గర ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్యాబిన్‌లో సజీవదహనం అయిన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version